
తెలుగు తెరపై తిరుగులేని హీరోయిన్ గ నిలిచిన వారిలో ఒక్కరు మన అతిలోక సుందరి శ్రీదేవి గారు, పాత్ర ఎలాంటిదైనా అందులో మునిగిపోయి..ఆ పాత్రకు ప్రాణం పోసి నటించేవారు శ్రీదేవి, అందుకే వారిని లేడీ సూపర్ స్టార్ అఫ్ ఇండియా అని పిలిచేది..ఇంత పేరున్న శ్రీదేవి కు మాత్రం అసలు పొగరు అనేదే లేదు, తనకు కావాల్సింది దక్కకపోతే సర్దుకుపోయేది కానీ బెట్టు చేసేది కాదట.. చిన్నప్పుడు ఒకసారి ఆరోజు షూటింగ్ ముగించుకొని ఒంటరిగా కారులో ఇంటికి వెళ్తోంది చిన్నారి శ్రీదేవి. ట్రాఫిక్ సిగ్నల్స్ పడడంతో రోడ్ పక్కనే ఐస్ క్రీమ్ బండిని చూసి ‘నాకు ఐస్‌క్రీమ్ తినాలనుంది’ అని డ్రైవర్‌తో చెప్పింది. ‘వద్దు తల్లీ.. నువ్వు ఐస్‌క్రీమ్ తిన్నట్టు మీ అమ్మకి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. అలాంటివి తింటే నువ్వు లావైపోతావమ్మా’ అన్నాడు డ్రైవర్. కారు కదిలిపోతుంటే ఆ బండి వైపే చూస్తుండిపోయింది శ్రీదేవి. అప్పటికి బాల నటిగా తన సంపాదనతో కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్న శ్రీదేవికి ఇష్టమైనవి తినే స్వేచ్ఛ కూడా లేదట. అప్పటికి తనకు కేవలం ఆరేళ్ళు మాత్రమే.. ఐస్‌క్రీమ్ కావాలని మారం చేయలేదు.. సర్దుకుపోయింది శ్రీదేవి.

