
తెలుగు లో పలు సినిమాలతో ఆకట్టుకున్న అమలా పాల్..డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ చేసిన ఈ బ్యూటీ గురించి మరో వార్త బయటకు వచ్చింది. అది కూడా కొత్త బాయ్ ఫ్రెండ్ తో అమలా ప్రేమాయణం సాగిస్తుందనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. పంజాబీ కుర్రాడు భవీందర్ సింగ్ తో అమలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండానే చాలా రహస్యంగా రొమాంటిక్ లైఫ్ ని సాగిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా భవీందర్ సింగ్ సోషల్ మీడియాలో అమలాపాల్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసాడు. ఈ ఫోటోకి `నా ప్రియ నీ పట్ల నేను ఎంతో గర్వపడుతున్నా. నీవు ఎప్పటిలాగే ఆడియెన్స్ ని అలరించడంలో మరింత ముందుకు సాగాలి` అంటూ కామెంట్ పెట్టడం తో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. మరి నిజంగా అమలా ప్రేమలో పడిందా లేదా అనేది ఆమెనే తెలపాలి

