[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బు[/qodef_dropcaps] ధవారం చెన్నైలో జరిగిన దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికల్లో వివాదం జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు రాధారవి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పోటీ చేసింది. అయితే బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరష్కరించారు. దీంతో పోటీదారుడైన రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అయితే చిన్మయి నామినేషన్ తిరష్కరణ గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్ తిరష్కరణపైనా, రాధారవి ఏకగ్రీవ ఎంపికపైనా కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.
వీరిద్దరి మద్య చాలా కాలంగా వివాదం నేలగొన్న సంగతి తెలిసిందే. గతంలో రాధారవిపై చిన్మయి మీటూ ఆరోపణలు గుప్పించింది. దీంతో చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమెను యూనియన్ నుంచి తప్పించారు. అయితే ఆమె కోర్టును ఆశ్రయించి యూనియన్‌లో తన సభ్యత్వాన్ని నిలుపుకున్నారు