
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రా[/qodef_dropcaps] జమౌళి సినిమా ఎలా వస్తుంది అనే ప్రశ్న అడగొచ్చు కానీ ఎప్పుడొస్తుంది అని మాత్రం అడక్కూడదు. ఇఫ్పుడు RRR సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది.జులై 30న విడుదలవుతుందని రామ్ చరణ్, ఎన్టీఆర్ చెబుతున్నారు కానీ అసలైన వాడు రాజమౌళి మాత్రం చెప్పడం లేదు.
ఈ సినిమా జులై 30 నుంచి ఆరు నెలలు పోస్ట్ ఫోన్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. 2021 జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఎందుకంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా పనులుంటాయి. ముఖ్యంగా డిఐ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఉన్నాయి. దానికి తోడు స్వాతంత్ర్యానికి పూర్వం కథ కావడంతో కచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భారీ స్థాయిలోనే విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటున్నాడు రాజమౌళి. అందుకే సినిమాను మరో ఆరు నెలలు వాయిదా వేశాడు రాజమౌళి అన్నీ కుదిర్తే కచ్చితంగా సినిమాను జులై 30న విడుదల చేయాలి అనుకున్నాడు కానీ సమయం సరిపోవడం లేదు అంటూ ట్వీట్ చేశాడు దర్శకధీరుడు.