
డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని జంట, ఏ ఫంక్షన్ అయినా ఎక్కడయినా ఇద్దరు కలసి కనిపిస్తారు. జీవిత గారు తన కెరీర్ తోలి రోజుల్లో రాజశేఖర్ గారితో కలసి తలంబ్రాలు, ఆహుతి మరియు అంకుశం సినిమా ల లో నటించారు. తలంబ్రాలు చిత్రంలో రాజశేఖర్ గారు నెగటివ్ రోల్ ప్లే చేసారు, జీవిత గారిని మోసం చేసిన విలన్ క్యారెక్టర్.మనందరికీ తెలుసు రాజశేఖర్ గారిని జీవిత గారు “బంగారం” అని పిలుస్తుంటారు, కానీ పెళ్లి కి ముందు జీవిత గారు రాజశేఖర్ గారిని ఇంకొక పేరుతో పిలిచే వారు, “మగాడు” చిత్రం షూటింగ్ లో గాయాల పాలయిన రాజశేఖర్ గారు హాస్పిటల్ లో చేరారు, జీవిత గారు దగ్గర ఉండి చూసుకున్నారు, అప్పుడు రాజశేఖర్ గారిని చూడడటానికి వాళ్ళ ఫామిలీ చెన్నై నుంచి వచ్చారు, వాళ్ళ ముందు అలవాటుగా రాజశేఖర్ గారిని తాను రెగ్యులర్ గ పిలిచే పేరుతో పిలిచారు, అది విన్న రాజశేఖర్ గారి అమ్మ గారు, జీవిత గారికి సీరియస్ గ వార్నింగ్ ఇచ్చారు, ఏంటి మా వాడిని ఆలా పిలుస్తున్నావు, ఇదేం బాగోలేదని.ఇంతకీ జీవిత గారు రాజశేఖర్ గారిని ఏమని పిలిచే వారో తెలుసా?” ఫ్రాడ్” తలంబ్రాలు చిత్రంలో జీవిత గారిని చీట్ చేస్తారు కదా అందుకే ఆ క్యారెక్టర్ కారణం గ జీవిత గారు ఆయనను ఫ్రాడ్ అని ముద్దు గ పిలిచే వారట.ఎంత ముద్దయిన అమ్మ ముందు బిడ్డను ఆలా పిలిస్తే, ఎవరి అమ్మకయినా కోపం వస్తుంది కదూ! అప్పటి నుంచి ఆలా పిలవటం మానేసి “బంగారం” అని పిలవటం అలవాటు చేసుకున్నారట, ఆ విషయం జీవిత గారు ఒక టీ.వి. షో లో చెప్పి అందరిని నవ్వించారు. ప్రేమలో ఉన్నప్పుడు ఫ్రాడ్ అన్న, ఒరేయ్, అన్న నడుస్తుంది కానీ పెళ్లి అయ్యాక ఆలా అనలేరు కదా.కానీ రాజశేఖర్ గారి రియల్ క్యారెక్టర్ తగినట్లు ఆయనను బంగారం అని పిలవటమే న్యాయం, అందుకు జీవిత గారిని అభినందించాలి.

