యాక్షన్ డైరెక్టర్ బోయపాటి గారు తీసిన మొదటి సినిమా ‘భద్ర’ సూపర్ డూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు బోయపాటి గారు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా కేవలం 5 లక్షల రూపాయలు. సినిమా రిలీసైనా కొన్ని నెలలు తరువాత బోయపాటి గారు ఒక ఇంటరెస్టింగ్ విషయం బైట పెట్టారు అదేంటంటే.. భద్ర కథ ఆయనది కాబట్టి ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా రీమేక్ రైట్స్ ని ఎవరికన్నా ఇస్తే అందుకు వచ్చిన అమౌంట్ లో 50 % కథ రాసిన వాళ్ళకి అంటే బోయపాటి గారికి ఇవ్వాలి. కానీ బోయపాటి గారికి చెప్పకుండా తన అనుమతి లేకుండా రెండు భాషలకి రీమేక్ రైట్స్ ని ఇచ్చేసారు దిల్ రాజు గారు. ఈ విషయం తెలుసుకున్న బోయపాటి గారు రాజు గారి ఇంటికి వెళ్లి ఏంటి సర్ చెప్పకుండా ఇలా చేసారు అని అడిగారట, దానికి రాజు గారు కరెక్టే డైరెక్టర్ గారు మీకు చెప్పలేదు..కానీ ఒక విషయం మిమల్ని అడుగుతా సూటిగా సమాధానం చెప్తారా అని అడిగారు, దానికి బోయపాటి చెప్తా అన్నారట. అప్పుడు దిల్ రాజు ‘అమ్మ శ్రీను నువ్వు ఫస్ట్ సినిమా చేసేటప్పుడు దీని మీద నీకు ఎలాంటి రైట్స్ లేవు అంటే నువ్వు సినిమా చేసేవాడివా లేదా’ అని అడిగారట. దానికి బోయపాటి గారు గ్యారంటీ గ చేసేవాడిని అని అన్నారట, ఇక ని ఇష్టం అడుగుతే ఇస్తాను అన్నారు దిల్ రాజు, దానికి బోయపాటి గారు చిన్న చిరునవ్వు నవ్వి నాకు వద్దు సర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారట. సినిమా ఛాన్స్ దిల్ రాజు గారు నాకు ఇవ్వడమే నా అదృష్టం, ఆయన చెప్పిందాంట్లో కూడా నిజం ఉంది అని చెప్పారు బోయపాటి గారు.