in

20 years for Sri Manjunatha!

శ్రీ మంజునాథ తెలుగు, కన్నడ భాషలలో నిర్మితమయిన శివ భక్తుడు అయిన మంజునాథుడి జీవిత గాధ. రాఘవేందర రావు గారి దర్శకత్వం లో , నారా జయశ్రీ దేవి నిర్మించిన భక్తి రస చిత్రం శ్రీ మంజునాథ.మంజునాథుని గ అర్జున్, శివుడి గ చిరంజీవి గారు అత్యద్భుతం గ నటించి ప్రేక్షకులను రంజింప చేసారు. హేతువాది గ ఉన్న మంజునాథుడు, శివ భక్తుడి గ మారి శివాన్వేషణలో గడుపుతుంటాడు. తన భక్తుడిని పరీక్షించ దలచిన శివుడు, ఒక వృద్ధ యాచకుడి రూపం లో అన్నార్థి అయి, మంజునాథుడి ఇంటికి వస్తాడు. వృద్దుడి రూపం లో దుర్గంధ భరితం గ ఉన్న లయకారుడిని గుర్తిచకుండా, తిన బోతున్న విస్తరిని లాగేసి బయటకు గెంటివేస్తాడు మంజునాథుడు.

నేనెవరో తెలియక గెంటివేస్తున్నావు నువ్వు రమ్మని పిలిచినా మళ్ళి రానుఅంటున్న, వినిపించుకోకుండా గెంటివేస్తాడు. ఈ సన్నివేశం లో చిరంజీవి గారి నటన చూసిన వారికీ కంట నీరు ఉబికి వస్తుంది,అంత అద్భుతం గ నటించారు చిరంజీవి గారు. తాను గెంటి వేసింది తన శివయ్య నే అని తరువాత తెలుసుకొని, తాను చేసిన తప్పుకు పరితపించే భక్తుడి గ అర్జున్ గారి నటన కూడా అదే స్థాయి లో ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తుంది. శివుడిగా చిరంజీవి గారు చేసిన రుద్రా తాండవం నభూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. శ్రీ మంజునాథ చిత్రం జూన్ 22 వ తేదీ, 2001 లో రిలీజ్ అయి ప్రేక్షకులను రంజింప చేసి 19 వసంతాలు గడచి పోయాయి

aadhi sai kumar and payal rajput team up for ‘kirathaka’!

Nidhi Agarwal Looks Beautiful In Yellow Saree!