అల్లు అట్లీ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇంత వరకు ప్రకటన విడుదల కానప్పటికీ దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కొన్ని ప్రైవేటు సాంగ్స్ చేశాడు. అవన్నీ కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.
అల్లు అర్జున్ ఫాంటసీ సినిమా కోసం 20 ఏళ్ల సాయి అభ్యంకర్
ఇప్పటి వరకు రాక్ స్టార్ అనిరుధ్ వద్ద అడిషనల్ ప్రోగ్రామర్‌గా సాయి అభ్యంకర్ పనిచేశాడు. దేవత, కూలీ లాంటి సినిమాలకు అడిషనల్ ప్రోగ్రామర్‌గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడనే వార్తలు రావడంతో, ఎలాంటి నేపథ్యంతో ఈ అవకాశం దక్కించుకున్నాడని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు..!!