విహార యాత్రల్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. మానసిక ఆహ్లాదంతో పాటు ప్రపంచాన్ని అన్వేషిస్తూ ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు’ అని అంటున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. గత మూడు నెలలుగా వరుస షూటింగ్స్‌తో బిజీగా గడిపిన ఈ అమ్మడు నెల రోజుల పాటు విహార యాత్రలకు సిద్ధమవుతున్నది..నాలుగు ఖండాల్లోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ టూర్‌ను ప్లాన్ చేశానని చెప్పింది పూజాహెగ్డే. ‘ఇదొక ఎపిక్ జర్నీ. నా యాత్రల్లో చాలా ప్రత్యేకమైనది. ప్రయాణాలు కేవలం సేద తీరటానికి మాత్రమే అనుకోను. మన ఆలోచన స్రవంతిని విస్త్రతపరచుకుంటూ ఎన్నో కొత్త అనుభవాల్ని సొంతం చేసుకోవడానికి ప్రయాణాలు దోహదపడతాయి. ఈ విహారం తాలూకు జ్ఞాపకాల్ని మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటా’ అని పూజాహెగ్డే పేర్కొంది. ఈ సందర్భంగా బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఓ ఫొటోను పంచుకుంది…