
ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఈజీగా వచ్చేస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లకు. వరుసగా రెండు ఫ్లాపులు తగిలితే చాలు..వాళ్ల మెడలో ఐరెన్ లెగ్ అనే దండ వేసేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఆ ట్యాగ్ భాగశ్రీ బోర్సే దగ్గర ఉంది. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, కాంత సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు సొంతం చేసుకొంది. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. ఆ సినిమా కూడా భాగ్యశ్రీకి తొలి హిట్ అందించలేకపోయింది..
అయితే ఆమె అవకాశాలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఏదో ఓ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ పేరు వినిపిస్తూనే ఉంది. స్వప్నదత్ ఇప్పుడు ఓ కొత్త సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంచుకొంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా. కథలో హీరోయిన్‌ది కీలక పాత్ర. అందుకు అభినయం ఉన్న హీరోయిన్ కావాలి. సమంత, రష్మిక లాంటి పలు పేర్లు పరిశీలించి, చివరికి భాగ్యశ్రీకి ఓటేశారు. గ్లామర్ విషయంలో భాగ్యశ్రీకి తిరుగులేదు. నటన కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో చేస్తుంది..!!

