పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ రావిపూడి సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గానే సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ కొట్టాడు అనిల్. ఇక నెక్స్ట్ మెగా బాస్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. చిరుతో అనిల్ చేసే సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో చిరంజీవికి విలన్ గా యువ హీరో నటిస్తాడని తెలుస్తుంది..
RX 100 హీరో కార్తికేయ మెగాస్టార్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడట. చిరంజీవికి వీరాభిమాని అయిన కార్తికేయ ఈ ఛాన్స్ ని వాడుకోవాలని చూస్తున్నాడు. ఓ పక్క హీరోగా చేస్తూ విలన్ గా తన మార్క్ చాటాలని చూస్తున్నాడు కార్తికేయ. ఆల్రెడీ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా చేసి మెప్పించాడు. కోలీవుడ్ లో అజిత్ కి విలన్ గా చేశాడు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా విలన్ గా చేస్తాడని టాక్. మరి అదే నిజమైతే మాత్రం చిరుతో కార్తికేయ ఫైట్ సినిమాకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.!!