పుష్ప సినిమా లో పుష్పరాజ్, సహచరుడయిన “కేశవ ” పాత్రలో నటించిన నటుడు ఎవరు? పుష్ప రాజ్ స్టోరీని ఇతని వాయిస్ ఓవర్ లో వినిపించటం ఇంకొక విశేషం. ఇతని అసలు పేరు బండారి జగదీశ్ ప్రతాప్ , వరంగల్ వాసి , ఎటువంటి సినిమా నేపధ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నటన అంటే ఉన్న ప్యాషన్ వలన , తల్లి తండ్రులను ఒప్పించి హైదరాబాద్ చేరి తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చిన్న, చిన్న పాత్రలు చేసేవాడు, ఆలా చేస్తున్న క్రమంలో “నిరుద్యోగ నటులు” అనే వెబ్ సిరీస్ లో నటించాడు, ఆ తరువాత “మల్లేశం”, “జార్జి రెడ్డి” చిత్రాలలో నటించాడు, ” పలాస “అనే చిత్రంలో మంచి పాత్రలో నటించాడు..
ఆ తరువాత ” ఆహా” ఛానల్ లో వచ్చిన” కొత్తపోరాడు” అనే వెబ్ సిరీస్ లో నటించాడు . అందులో అతని పెర్ఫార్మన్స్ చూసిన సుకుమార్ గారు జగదీష్ ను కేశవ పాత్రకు తీసుకోవటం జరిగింది, ఎప్పుడు ఊహించని అద్భుత అవకాశం కేశవ పాత్ర, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు . సుకుమార్ మరియు అల్లు అర్జున్ సహకారం తో తన నటనకు మెరుగులు దిద్దాడు, ఎవరబ్బా ఈ కేశవ అని అందరు చూసేట్లు నటించాడు. తెలంగాణాలో పుట్టి పెరిగిన జగదీశ్ , కేశవ గ చిత్తూరు యాసను దించేసాడు. చూసే వారిని చిత్తూరు జిల్లా వాడేమో అనే విధంగా భ్రమింప చేసాడు..