కన్నడ హీరో యశ్ నటించిన తాజా చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్ 2. తాజాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్లు నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ ఈ సినిమా గురించి కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, అందులో నటించిన తారక్, రామ్ చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి వివరించారు..జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..
ఆయన ఇంటి కూడా రెండు, మూడు సార్లు వెళ్లానని, డిన్నర్ కూడా చేశానని యశ్ చెప్పుకొచ్చారు. “ఎన్టీఆర్ కుటుంబం ఇచ్చిన ఆతిథ్యాన్ని నేను అస్సలు మరువలేను. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ముఖ్యంగా తారక్ వాళ్లమ్మ శాలిని గారు ఎంతో మంచివారు. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. బహుశా కర్ణాటకకు చెందిన వారు కావడం కారణమనకుంటా వారితో బంధం బలంగా ఉంది. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకాకు చెందిన వారు. ఆమె నాతో చాలా బాగా మాట్లాడారు.” అని యశ్ చెప్పారు.