in

yami gautham reveals peoples reaction about her skin disease!

క‌ప్పుడు సినిమా సెల‌బ్రిటీలు త‌మలోని లోపాల‌ను బ‌య‌ట‌కు చెప్పేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డేవారు కాదు. తాజాగా బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోయింది యామీ గౌతమ్ ప‌లు విష‌యాలు వెల్ల‌డించింది. ఇక బుల్లితెరలో మాత్రం ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టింది. దీంతో తను ఈ బ్రాండ్ ను ప్రకటించగా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ ప్రకటనతో బాగా దగ్గరయ్యింది. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల తన వ్యక్తిగత విషయం గురించి తెలియజేసి అందరిని షాక్‏కు గురిచేసింది యామీ గౌతమ్. యుక్త వయసు నుంచి తను కెరాటోసిస్ పిలారిస్ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో వెల్లడించింది. ఇటీవల ఎలాంటి ఎడిట్ చేయని తన ఫోస్ట్ చేసి ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది హీరోయిన్. “చాలా సంవత్సరాలుగా ఉన్న భయం.. అభద్రతా భావాలను ఈరోజు విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. నా లోపాలను మనస్పూర్తిగా అంగీకరించే దైర్యం నాకు వచ్చింది. ఈ నిజాన్ని మీతో పంచుకునే దైర్యం వచ్చింది.

ఎరుపు రంగులో ఉండే నా జుట్టుకు రంగు వేయడం.. కంటి కింద చారలను స్మూత్ నింగ్ చేయాలని నాకు అనిపించట్లేదు. అయినా నేను అందంగనే ఉన్నా” అంటూ షేర్ చేసింది యామీ గౌతమ్.. ప్రజలు నన్ను షూటింగ్ లో చూసినప్పుడు బ్రష్ ఎలా చేయాలి. కనపడకుండా ఎలా దాచాలి అంటూ మాట్లాడేవారు. అది నన్ను చాలా బాధించింది. నిజాన్ని అంగీకరించడానికి.. నా విశ్వసాన్ని పెంపొందించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు ఈ పోస్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి సంతోషపడ్డాను అంటూ యామీ గౌతమ్ తెలిపింది.

SUMAN DATES ADJUST KAKAPOVADAMTHO HERO AVAKASAM DAKKINCHUKUNNA RAJA SEKHAR!

singer mangli gets aggressive on fans over selfies!