చిరంజీవి గారు శివుడిగా నటించిన మంజునాథ చిత్రం చూసిన ఒక ప్రేక్షకుడు, యమధర్మ రాజు కు భక్తుడిగా మారిపోయాడు. సాధారణంగా యముడి పేరు చెబితే అందరికి వెన్నులో వణుకు మొదలవుతుంది కానీ, మన తెలుగు చిత్రసీమలో యముడు సెంట్రిక్ గ చాల ఫాంటాసి సినిమాలు వచ్చాయి. మంజునాథ సినిమా మాత్రం పౌరాణిక చిత్రం కావటం, అందులో చిరంజీవి గారు శివుడిగా నటించటం విశేషం. ఆ చిత్రం లో పరమ శివభక్తుడి ప్రాణాలు హరించటానికి, ధర్మ సంకటం లో పడిన యమధర్మ రాజు, యమ పాశాన్ని శివుడికి అందించి వెళ్ళిపోతాడు. ఆయన పాటించిన ధర్మం పట్ల అనురక్తి పెరిగిన ఒక ప్రేక్షకుడు, ఏకం గ యమ భక్తుడిగా మారిపోయాడు, అప్పటి నుంచి యముడిని దేవుడిగా ఆరాధిస్తూ తరిస్తున్నాడు.నిత్యం యముడిని స్మరిస్తూ, ఆయనకు పూజలు చేయటమే కాకుండా..
యముడి పేరును చేతి మీద పచ్చ బొట్టు కూడా వేయించుకున్నాడు. అలా యమ ధ్యానం చేయటం వలన చావు తన దరి చేరదని అతని నమ్మకం.యముడి పట్ల భయం కాకుండా అచంచలమయిన భక్తి ని పెంపొందించుకున్నాడు. మనోడి లాగానే జపానోళ్లకు కూడా యముడంటే భయం లేదండోయ్, అందుకే వాళ్ళు మోటారుబైక్ కి “యమహా” అని పేరు పెట్టుకున్నారు, “యమగుచి” అని మనుషులకు పేర్లు కూడా పెట్టుకుంటారు. మనోళ్లు మాత్రం ఆలా పేర్లు పెట్టుకొనేంత ధైర్యం చేయలేక పోయినా, యముడి మీద భయం తో కూడుకున్న భక్తి మాత్రం ప్రదర్శిస్తుంటారు. ఎవడయినా బైక్ మీదో,కారులోనే స్పీడ్ గ వెళితే “యమ స్పీడ్” గ పోతున్నాడు అంటారు, అంటే అర్ధం తెలుసా? యముడి సాన్నిధ్యం చేరేంత వేగంగా వెళుతున్నాడని అర్ధం. యమ ధర్మాన్ని పూర్తి గ అర్ధం చేసుకున్న ఆ ప్రేక్షకుడు యమ భక్తుడిగా మారి తరిస్తున్నాడు, భక్తి పలు విధాలు అనటానికి చక్కటి ఉదాహరణ గ చెప్పుకోవచ్చు..!!