రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉందనే సంగతి తెలిసిందే. ఇది మల్టీస్టారర్ కాదనీ .. ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే పెద్ద సినిమా అని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ ప్రాజెక్టును గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. “మొదటి నుంచి కూడా రాజమౌళికి ఫారెస్టు అంటే ఇష్టం .. ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథలంటే ఇష్టం. ప్రకృతిని .. జంతువులను ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు.
అందువలన చాలాకాలం నుంచే ఫారెస్టు నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. ఈ కారణంగానే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఒక కథను రెడీ చేశాను. అయితే రాజమౌళి ఒక సినిమా రిలీజ్ అయ్యేవరకూ మరో కథను వినడు. ఫారెస్టు నేపథ్యంలో కథను సిద్ధం చేస్తున్నాననే సంగతి ఆయనకి తెలుసునుగానీ, అది ఎలా ఉంటుందనేది ఆయనకి తెలియదు. ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ అయిన తరువాత పది పదిహేను రోజుల తరువాత వింటాడేమో. ఆయన కథ విన్న తరువాత మార్పులు .. చేర్పులను గురించిన ఆలోచన చేస్తామని అన్నారు.