in

WIVES EARNING MORE THAN OUR STAR HEROES!

టాలీవుడ్ లో ఉన్న ఇప్పటి స్టార్ హీరోల భార్యల కూడా వారి భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇంటిపట్టున ఉండటం కాదు.. బయటికి వచ్చి వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు. తమకు నచ్చిన పని చేసుకుంటూ సంపాదిస్తున్నారు. భర్తలకు తామేం తక్కువ కాదంటున్న కొందరు ఎవరో ఒకసారి చూద్దాం రండి.

నాని భార్య అంజనా – అంజనా గారు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. బెంగళూర్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన అంజనా.. ఇప్పుడు రాజమౌళి ఆర్కా మీడియాలో పని చేస్తుంది. అక్కడ క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా వర్క్ చేస్తుంది అంజన. ఈమె జీతం లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది. బాహుబలి సినిమాకు కూడా ఈమె క్యాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం విశేషం.

రామ్ చరణ్ భార్య ఉపాసన – రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా భారీగానే సంపాదిస్తున్నారు. ఆమె కూడా హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. దానికితోడు అపోలో హాస్పిటల్స్‌లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఉపాసన. బిజినెస్ కూడా చూసుకుంటున్నారు. ఇలా చరణ్‌కు ధీటుగా తన భార్య కూడా సంపాదిస్తున్నారు.

అల్లరి నరేష్ భార్య విరూప – అల్లరి నరేష్ భార్య విరూప కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఆమె ఈవెంట్ మానేజర్‌గా పని చేస్తున్నారు. ఒక్కో ఈవెంట్ కోసం లక్షల్లో తీసుకుంటున్నారు విరూప.. హైదరాబాద్ మరియు బెంగుళూరు లాంటి మేజర్ సిటీస్ లో తన ఈ బిజినెస్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి – పెళ్లై ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా స్నేహ గారు తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్పెక్‌ట్రం అనే మ్యాగజీన్‌కు ఛీఫ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు స్నేహా. ఫారెన్‌లో చదువుకున్న ఈమె ఇప్పుడు జాబ్ చేస్తుంది. మరోవైపు తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్స్ పనులు కూడా చూసుకుంటుంది ఈమె.

రాజీవ్ కనకాల భార్య సుమ – యాంకర్ సుమ కూడా భర్త రాజీవ్ కంటే ఎక్కువే సంపాదిస్తుంది. ఈమె సంపాదన గురించి ప్రత్యేకంగా డిబేట్స్ అవసరం లేదు. కంటి ముందు కనిపిస్తుంది కాబట్టి. యాంకర్‌గానే కాకుండా ఇప్పుడు యూ ట్యూబ్ ఛానెల్ కూడా మొదలు పెట్టి చేతినిండా సంపాదిస్తున్నారు.

రాజశేఖర్ భార్య జీవిత – యాంగ్రీ హీరో రాజశేఖర్ గారి జీవిత భాగ్యస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన భర్త సంపాదనకి ఏమాత్రం తీసిపోకుండా ఈమె కూడా సంపాదిస్తుంది. ఈమె సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా పనిచేస్తుంది.

laxmi raai on her affairs!

Yash reveals about his early struggles!