నేను నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ‘చెక్’. తెలుగు నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే, మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘చెక్’ వచ్చింది. మరో ఆలోచన లేకుండా అంగీకరించా. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ‘మనమంతా’ చూశా. తెలుగు కాదు… మలయాళంలో. అక్కడ ‘విస్మయం’ పేరుతో విడుదలైంది. అందులో నా అభిమాన హీరో మోహన్ లాల్ నటించడంతో మిస్ కాలేదు.
ఆ సినిమా చూసినప్పుడు చందూ సార్ ఎంత గొప్ప డైరెక్టర్ అనేది అర్థమైంది. ఆయన ఫోన్ చేసి ‘చెక్’లో నువ్వు నటించాలని అడిగారు. సీనియర్, బ్రిలియంట్ డైరెక్టర్ అడిగారు… పైగా నితిన్, రకుల్ చేస్తున్నారని చెప్పారు. మంచి స్టార్ కాస్ట్, మంచి ప్రొడక్షన్ హౌస్ కనుక హ్యాపీగా ఓకే చేశా. ఇప్పుడు నాతో ఎవరైనా తెలుగులో మాట్లాడితే… వాళ్లు ఏం చెబుతున్నారో అర్థం అవుతుంది. కొంచెం కొంచెం మాట్లాడగలను. తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేస్తే పూర్తిగా తెలుగులో మాట్లాడతాను.