in

Wine glass in the hand, Surekha Vani’s raccha on social media!

టాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సురేఖవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అక్క, వదిన, పిన్ని పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక కరోనా సమయంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో విపరీతమైన డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక కుదుపు కుదిపింది.

దీంతో ఈమెకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. సురేఖ వాణి నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పటికీ తన కూతురితో కలిసి గ్లామరస్ దుస్తులలో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనట్టుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్నిసార్లు ట్రోలింగ్ కి గురైంది.

ఇదిలా ఉండగా తాజాగా సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా మరొక ఫోటోని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడంతో ఈ ఫోటోపై చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరు ఇలా మందు గ్లాసుతో ఫోటో షేర్ చేయడంతో ఈ పై ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ అయితే ఏకంగా పెళ్లి చేసుకుంటావా అంటూ కామెంట్ చేయడం విశేషం.

rashmika mandanna says ‘a big no’ to item songs!

Bollywood Superstar To Join Chiranjeevi’s ‘god father’ soon!