సినిమా హిట్టో, ఫ్లాపో తర్వాత సంగతి కానీ.. సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిందంటే చాలు కావలసినంత ప్రమోషన్ చేసేస్తుంది తన పంచ్ డైలాగులతో.. ఆ ప్రోగ్రామ్ ని రక్తి కట్టిస్తుంది తన సరదా సంగతులతో. ఆమె కోసం డేట్లు అడ్జెస్ట్ చేసుకుని మరీ ప్రీరిలీజ్ ఈవెంట్లు చేసుకునే దర్శక నిర్మాతలున్నారంటే ఆమె రేంజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. యాంకరింగ్, టీవీలో ప్రోగ్రాములు, స్టార్స్ తో ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాల్లో కూడా నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తోంది.. జయమ్మ పంచాయితీ చేస్తుండగానే మరో రెండు కథలు కూడా తన దగ్గరకు వచ్చాయట. అయితే తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తానంటోంది ఈ జయమ్మ..
మరి వరుస సినిమాలు చేస్తే యాంకరింగ్ సంగతి ఏంటి అని సుమ ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు.. సుమ ఉంటే బోల్డంత ఫన్.. అదంతా మిస్సైపోతాం అని అంటున్నారు.. దానికి సుమ బుల్లితెర తనకు అమ్మలాంటిది.. తనకు అన్నం పెట్టిన అమ్మను ఎవరైనా వదిలేస్తారా.. యాంకరింగ్ ను వదిలే ప్రసక్తే లేదని తెలిపింది. సినిమాల్లో నటిస్తూనే యాంకరింగ్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఒంటి చేత్తో ఎన్నైనా చేయగల సమర్ధురాలు సుమ.. సినిమాలు ఓ లెక్కా ఏంటి.. అన్నట్లు వాళ్ల అబ్బాయికి కూడా సినిమాల్లో నటించడం అంటే ఇష్టమట. ఈ ఏడాది చివర్లో అతడి చిత్రం కూడా సెట్స్ పైకి రాబోతోంది.