in

Why No Hero Can Ever Match Superstar’s Guts?

ల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు ఎన్టీఆర్ స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా పట్టాలెక్కలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు వంటి వారు కూడా అల్లూరి పాత్రలో మూవీ తీయాలని ప్రయత్నించినా ఫలించలేదు. అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని సూపర్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందించారు. కృష్ణ కెరీర్‌లో 100వ సినిమాగా ఇది. అప్పట్లో 19 కేంద్రాల్లో వందరోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి సొంతం చేసుకుంది.

కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా అల్లూరి సీతారామరాజు సినిమా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత కృష్ణకు వరుసగా 12 ఫ్లాపులు ఎదురయ్యాయి. అల్లూరి పాత్రలో కృష్ణను చూసిన సినీ ప్రేక్షకులు.. ఇతర పాత్రల్లో ఊహించులేకపోయారు. 1975లో కృష్ణ కెరీర్ కుదేలైంది. ఆయనతో సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రాలేదు. ఇక అందరూ కృష్ణ పని అయిపోందనుకున్నారు. ఇక లాభం లేదనుకుని సొంత నిర్మాణం సంస్థలో పాడిపంటలు సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తరువాత మళ్లీ కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు. .!!

Varun Tej to romance Miss India in his next?

krishna Is He The First Pan India Superstar!