ప్రతి నటుడికి కొన్ని పాత్రలు చేయాలనే కోరిక ఉంటుంది. కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా, తమ మనసులో అనుకున్న పాత్రలతో కథలు మాత్రం వీళ్ల చెంతకు రావు. 340కి పైగా సినిమాలు చేసిన కృష్ణకు కూడా ఇలాంటి పాత్ర ఒకటి మదిలో ఉంది. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఛత్రపతి శివాజీ పాత్రను పోషించాలనేది కృష్ణ చిరకాల కోరిక. తనకున్న బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా ఈ పాత్ర గురించి ఆయన ఆలోచించేవారు. తన దగ్గరకొచ్చిన దర్శకులతో దీనిపై చర్చించేవారు. కానీ ఆయన కోరిక తీరలేదు.
ఛత్రపతి శివాజీ పాత్రతో కొన్ని కథలు సిద్ధమయ్యాయి. కానీ ఆ కథలేవీ ఆయనకు నచ్చలేదు. చివరికి ఓ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా ఓపెనింగ్ వరకు కూడా వచ్చింది. కానీ అంతలోనే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది. అలా ఛత్రపతి శివాజీ పాత్ర పోషించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కృష్ణ. ఆ పాత్రతో సినిమా చేయకుండానే ఆయన ఈ లోకాన్ని వీడారు. అయితే ఛత్రపతి శివాజీ పాత్రతో ఫుల్ లెంగ్త్ సినిమా చేయకపోయినా, ఓ సినిమాలో ఆ గెటప్ వేసి తన ముచ్చట తీర్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ..!!