ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకం కానున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఇండియన్ సినిమా చరిత్రలో ఆదిపురుష్ అత్యధికంగా విజువల్ ఎఫెక్ట్ వినియోగించిన సినిమా కానుందని చెప్తున్నారు. ఏకంగా ఎనిమిది వేలకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్తున్నారు. భారత సినీ చరిత్రలో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన..
బాహుబలిలో రెండో భాగానికి 2500 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ వినియోగించగా.. రోబో సీక్వెల్ 2.0కి అధికంగా 3000కి పైగా విజువల్ ఎఫెక్ట్ షాట్స్ వినియోగించినట్లు మేకర్స్ చెప్పుకున్నారు. అలాంటిది ఆదిపురుష్ కి ఏకంగా 8000 షాట్స్ వినియోగిస్తున్నారంటే ఆదిపురుష్ ఇండియన్ సినిమా దగ్గర ఏ రేంజ్ విజువల్ ట్రీట్ ను ఇవ్వనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇదే సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది..