
తన ప్రేమ సంబంధాలు, బ్రేకప్స్ గురించి మాట్లాడుతూ, శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కొందరు ‘ఇది నీకు ఎన్నో బాయ్‌ఫ్రెండ్?’ అని అడుగుతుంటారు. వాళ్లకు అది కేవలం ఒక సంఖ్య. కానీ నాకు, నేను కోరుకున్న ప్రేమను పొందడంలో ఎన్నిసార్లు విఫలమయ్యానో తెలిపే సంఖ్య అది. కాబట్టి, దాని గురించి నేను బాధపడను..కానీ కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా మనిషినే కదా,” అని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తాను సంబంధాల్లో ఉన్నప్పుడు నమ్మకంగానే ఉంటానని, అయితే ఒకరిని భాగస్వామిగా ఎంచుకోనప్పుడు, దాని గురించి ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సంబంధాలు విఫలమైనప్పుడు తాను భాగస్వాములను నిందించనని కూడా శ్రుతి స్పష్టం చేశారు..!!

