డ్రీంబాయ్ అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు. దక్షణ భారత చలన చిత్ర తీరంలో ఒక్క సారిగ ఎగసి పడిన సునామి అబ్బాస్, 25 ఏళ్ళ క్రితం వచ్చిన “ప్రేమ దేశం” చిత్రం తో చిత్ర రంగ ప్రవేశం చేసి, అమ్మాయిల కలల హీరో గ, అబ్బాయిలకు యూత్ ఐకాన్ గ వెలుగొందిన హీరో అబ్బాస్, క్రమంగా తెర మరుగై పోయారు. మొదటి చిత్రం తో స్టార్ డం రావటం వరమా? శాపమా? అంటే చాలామంది పాలిట అది శాపమే అని చెప్ప వచ్చు. ఒకే చిత్రం తో విపరీతమయిన స్టార్ ఇమేజ్ రావటం, ఆ తరువాత వారి కెరీర్ అదే స్థాయి లో కొనసాగటానికి ఆటంకమే అని చెప్ప వచ్చు, దానికి నిలువెత్తు నిదర్శనం అబ్బాస్ సినిమా కెరీర్, చూడటానికే ఎంతో హ్యాండ్సమ్ గ, రిచ్ గ కనిపించే అబ్బాస్ కెరీర్, చాల ఒడిదుడుకులతో సాగింది.
చివరకు ఒకటి రెండు చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేసారు. ఇక్కడ అవకాశాలు లేక బ్రతకడానికి ఏదైనా చేద్దామంటే నలుగురిలో తనకు ఉన్న ఇమేజ్ కారణం గ, వేరే పనులు చేయలేక, న్యూజీలాండ్ వంటి సుదూర దేశానికీ తరలిపోయారు అబ్బాస్. అక్కడ తనంటే ఎవరికి తెలియదు కాబట్టి, కొంత కాలం పెట్రోల్ పంప్ లో పని చేసారు, మెకానిక్ గ, భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసారు, చివరకు ఆత్మ న్యూనతకు లోనై ఒకానొక సందర్భం లో జీవితం ముగించాలి అనుకోని, తరువాత ధైర్యం గ తట్టుకొని నిలబడి, జీవితం తో కలబడి నిలబడ్డారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా లో వ్యక్తిత్వ వికాస నిపుణిడిగా, తన స్పీచ్ లతో ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపుతున్నారు. అబ్బాస్ గారి కొత్త ప్రయాణం ఒడుదుడుకులు లేకుండా సాగాలని కోరుకుందాం..