నేమ్ లో ఏమున్నది, అనుకుంటారు చాలామంది, కొంత మంది తమ పేరుకు తగినట్లుగానే జీవితాన్ని గడుపుతారు, మరి కొంత మంది వారి పేరుకు, ప్రవర్తనకు పొంతన లేకుండా గడిపేస్తారు.పుట్టగానే అమ్మ,నాన్న పెట్టేది పేరు(నామకరణం) ఆ తరువాత ఎదిగే క్రమంలో మనం గడించేది పేరు(మంచి పేరు) పెంచుకొనేది ప్రతిష్ట.కాబట్టి పేరుకు మన జీవితానికి సంబంధం ఉండదేమో? ఈ సోదంతా ఎందుకంటే తమ పేరుకే అప్రతిష్ట మూటగట్టుకున్న ముగ్గురు కన్నడ భామల గురించి. పవిత్ర లోకేష్, ఆరు పదుల వయసులో నరేష్ ని ప్రేమించి, కుటుంబాన్ని వదిలిన ఒక వృద్ధ ప్రేమికురాలు. రెండో భామ, పవిత్ర జయరాం తెలుగు సీరియల్స్ ద్వారా బుల్లి తెర ప్రవేశం, బుల్లి తెర నటుడు చందు మనసులో కూడా ప్రవేశించింది..
వివాహితుడయిన చందు తో సహజీవనం, చివరకు కారు ప్రమాదంలో మరణించింది, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక తనకు ఒక కుటుంబం ఉన్నది అన్న సంగతి మరచిపోయి చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ముచ్చటగా మూడోభామ, పవిత్ర గౌడ, కన్నడ హీరో దర్శన్ తో ప్రేమలో పడింది, తమ అభిమాన హీరో జీవితంలోకి ప్రవేశించిన ఈ వివాహిత పవిత్రని దర్శన్ అభిమానులు టార్గెట్ చేసి ట్రోల్ చేయటం స్టార్ట్ చేసారు. అంతే తన ముద్దుల ప్రియుడి తో చెప్పి తనను దారుణం గ ట్రోల్ చేస్తున్న ఒక అభిమానిని మర్డర్ చేయించేసింది. సీన్ కట్ చేస్తే కన్నడ హీరో దర్శన్ జైలు పాలయ్యాడు. ఇదండీ ముగ్గురు పవిత్రల, అపవిత్ర కధ. అందు కె నేమ్ లో ఏముంది అంత ఫేమ్ లో నే ఉంది, కాదంటారా?