
ఇటీవల డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ.. ‘అదుర్స్ 2’ గురించి షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. “నిజం చెప్పాలంటే, అదుర్స్ కథ అక్కడితో ముగిసిపోయింది. ఇప్పుడు మళ్లీ అందులో కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. కేవలం సీక్వెల్ తీయాలి కదా అని బలవంతంగా తీస్తే, మొదటి భాగం అందించిన ఆ గొప్ప అనుభూతిని మళ్లీ తీసుకురాలేం” అని ఆయన స్పష్టం చేశారు. “అదుర్స్ మొదటి భాగాన్ని మించి లేదా అంత సమానంగా మళ్లీ తీయగలమన్న నమ్మకం నాకే లేదు.
అందుకే దాని జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్” అని వినాయక్ కుండబద్దలు కొట్టారు. కొన్ని అద్భుతమైన సినిమాలను సీక్వెల్స్ పేరుతో పాడు చేయకుండా, ఒక మధుర జ్ఞాపకంగా వదిలేయడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. వినాయక్ వ్యాఖ్యలతో ‘అదుర్స్ 2’పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు కొంత నిరాశ ఎదురైనప్పటికీ, ఒక కల్ట్ క్లాసిక్ సినిమా గౌరవాన్ని కాపాడాలనే ఆయన నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు..!!

