
పోవే పోరా’ వంటి టీవీ షోలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విష్ణుప్రియ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. గతంలో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తోటి కంటెస్టెంట్ పృథ్వీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వార్తల్లో నిలిచారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన బిగ్‌బాస్ అనుభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ, “నేను బిగ్‌బాస్ షోకు కేవలం డబ్బుల కోసమే వెళ్లాను. ఆ డబ్బుతో కొత్త ఇల్లు కట్టుకోవచ్చని ఆశపడ్డాను. కానీ నా ఆశ నెరవేరలేదు. ఇప్పటికీ నేను పాత ఇంట్లోనే ఉంటున్నాను. నిజం చెప్పాలంటే, బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లడం నా జీవితంలో నేను తీసుకున్న ఓ చెత్త నిర్ణయం. ఆ షో నుంచి నేనేమీ నేర్చుకోలేదు. నన్ను నేనే తిట్టుకున్నాను. ఎందుకు వెళ్లానురా బాబూ అనిపించింది. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి అనిపించేంతగా బాధపడ్డాను. మళ్లీ వాళ్లు పిలిచినా వెళ్లను” అని తన ఆవేదనను వెళ్లగక్కారు..!!

