విశాల్ తన సినిమా ‘ఎనిమీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ ఈవెంట్ లో పునీత్ రాజ్‌కుమార్‌కు సంతాపం తెలిపింది. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ అయ్యారు. పునీత్ మరణం చిత్ర సీమకే కాకుండా సమాజానికి కూడా తీరని లోటు అని వెల్లడించారు. పునీత్ ప్రారంభించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని ప్రకటించాడు. ఇక నుంచి పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పునీత్ ఆశయాలను తాను ముందుకు తీసుకవెళ్తానని తెలిపారు.
ఇప్పటికే విశాల్ కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సినిమాలతోపాటు రైతులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ.. వారిని ఆడుకుంటున్నాడు. తన సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయి రైతులకు, పేద ప్రజలకు చేరేలా చేస్తున్నారు.తన ఫంక్షన్స్ లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని తన అభిమానులకు పిలుపు నిచ్చారు విశాల్. ఇక ఇప్పుడు పునీత్ బాధ్యతను తాను ముందు తీసుకెళ్తాననడంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు విశాల్..