తెలుగు చిత్ర పరిశ్రమ లో ఏ జనరేషన్ లో అయినా డజన్ల కొద్దీ కమెడియన్స్ ఉండటం చాల సహజం అయిన విషయం, కానీ ఎవరి ప్రత్యేకత వారిది, పద్మనాభం, రాజబాబు, చలం, సమకాలికుడు అయిన కే.వీ.చలం తన తమిళ యాస తెలుగు తో చాల పాపులర్ అయ్యారు. కే.వి. చలం గారు కొన్ని విదేశీ భాషలు కూడా మాట్లాడే వారు తెలియని వారు నిజమయిన భాష అనుకొనే విధంగా భ్రమింప చేసే వారు, అయన సెట్ లో ఉంటె నవ్వులే నవ్వులు.కే.వి.చలం గారు వ్యాపార రీత్యా మద్రాసు చేరారు, కానీ విధి మరియు నటన పట్ల ఆయనకు ఉన్న మక్కువ సినిమా వైపు నడిపించింది.అల్లూరి సీతారామ రాజు, శివరంజని చిత్రాలలో వారు పోషించిన తమిళియన్ పాత్రలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి.దాసరి గారు కే.వి. చలం గారికి మంచి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అందాల నటుడు శోభన్ బాబు గారి కి అత్యంత సన్నిహితం అయినా నటుడు కే.వి.చలం గారు. వెండి తెర మీద బయట కూడా నవ్వులు పూయించిన కే.వి.చలం గారి జీవితం అర్ధాంతరం గ కోడంబాకం రైల్వే ట్రాక్ పైన ముగిసిపోయింది. అయన జీవితం ఒక నవ్వుల పుష్ప గుచ్ఛం అయితే, అయన మరణం మాత్రం ఒక మిస్టరీ గ మిగిలింది. తెలుగు చిత్ర పరిశ్రమను విషాదం లో ముంచిన అయన మరణం చివరగా అయన అంతిమ యాత్ర కూడా ఒక సినిమా కు పనికి వచ్చింది.మరణించే వరకు నటించటం కాదు, మరణానంతరం కూడా తేరా మీద కనిపించిన ఒకే ఒక నటుడు కే.వి. చలం గారు. అయన చనిపోయిన టైం లో దాసరి గారి డైరెక్షన్ లో “అద్దాల మేడ” అనే సినిమా లో నటిస్తున్నారు, ఆ సినిమా ఇతివృత్తం మొత్తం ఒక సినిమా షూటింగ్ ఆధారితం, అవుట్ డోర్ షూటింగ్ కోసం ఒక గ్రామానికి వెళ్లిన చిత్రం యూనిట్ కు విచిత్రం అయినా అనుభవాలు ఎదురు అవుతాయి. తనకు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన చలం గారి మరణం కూడా అక్కడ జరిగిన ఒక సంఘటన గ చిత్రీకరించారు దాసరి గారు.మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ పాలుగొన్న అయన అంతిమ యాత్ర ను చిత్రీకరించి ఆ సినిమా లో చూపించారు దాసరి గారు. ఇంత కంటే గొప్ప నివాళి ఏముంటుంది ఒక నటుడికి.