సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే!
సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అయిపోతారో చెప్పటం కష్టం. ఒక్క చిన్న రిల్ చేసి, ఫ్రాంక్ చేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. రీసెంట్ గా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి చాలా పాపులర్ అయిపోయింది. రాత్రికి రాత్రే కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు ఈమెకి. కారణం సోషల్ మీడియా. మధ్య ప్రదేశ్ లో ఇండోర్ కి చెందిన మోనాలిసా ప్రయాగ రాజ్ కుంభమేళాలో రుద్రాక్షలు, ముత్యాల దండలు అమ్ముతూ కనిపించింది..
ప్రయాగ రాజ్ కుంభమేళా మోనాలిసా కు రామ్ చరణ్ సినిమా ఆఫర్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న RC16 లో మోనాలిసా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న మోనాలిసాను బుచ్చి బాబు సెలక్ట్ చేసాడు. సెకండ్ హీరోయిన్ లేదా ఇంకేదైనా పాత్ర అన్నది చూడాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాన్ ఇండియా మూవీలో మోనాలిసా నటిస్తే పూర్తి క్రేజ్ వచ్చినట్టే. చెర్రీ పాన్ ఇండియా మూవీకి కావాల్సినంత బజ్ ఏర్పడుతోంది. దసరా బరిలో రానున్న ఈ మూవీతో మోనాలిసా తన ఫాన్స్ ని అలరించనుంది..!!