అల్లూరి కృష్ణమ రాజు , తూర్పు గోదావరి జిల్లా, రాజోలు లోని చించినాడ జమీందారు వారసుడు, కాలు మీద కాలేసుకుని, కూర్చొని తిన గలిగిన స్థోమత కలిగిన కుటుంబం, సినిమా లో నటించాలి అనే తృష్ణ అతనిని ఎలా నడిపించింది, ఒక సోలో హీరో క్యారెక్టర్ చేయడానికి 15 సంవత్సరాలు పట్టిన కూడా, వెనకడుగు వేయని అతని పట్టుదల. ఇదంతా ఎవరి గురించో కాదు మన వినాయకుడు కృష్ణుడి గురించే చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి బద్రి సినిమా చూసి ఫాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని, దాని ద్వారా నటుడు అవ్వాలనే కోరిక తో హైదరాబాద్ చేరిన కృష్ణుఁడు, ముందు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేసి, ఆ తరువాత పూరి జగన్నాథ్ గారి సజెషన్ తో, బొంబాయి లో సిబి శామ్యూల్ వద్ద ఫోటో గ్రఫీ చేసి, 1999 లో బంజారా హిల్స్ లో” ది ఫేసెస్” అనే స్టూడియో స్టార్ట్ చేసి కొన్ని సినిమా ల ఫోటో షూట్ చేసారు.ఆ తరువాత రసూల్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ భగీరధ సినిమా కి వర్క్ చేసారు. కొన్ని చిన్న చిన్న రోల్స్ చేసిన కృష్ణుడికి, పోకిరి, హ్యాపీ డేస్ సినిమాలతో గుర్తింపు లభించింది, అప్పుడే అడివి సాయికిరణ్ పరిచయం, అతని మనసులో ఉన్న ఒక స్క్రిప్ట్ కి యాప్ట్ అయిన ఫీజిక్ తో ఉన్న కృష్ణుడి స్టోరీ చెప్పినపుడు, ఆ రోల్ తన జీవితానికి చాల దగ్గరగా ఫీల్ అయిన కృష్ణుడు, కంట నీరు పెట్టుకున్నారు. 15 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత తన కల వినాయకుడు సినిమా రూపం లో నిజం అయింది.ఆ తరువాత వరుసగా సోలో కేరక్టర్స్ చేసిన కృష్ణుడు, గౌతమ్ మీనన్ గారి ఏ మాయ చేసావే, ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలతో సైడ్ రోల్స్ చేస్తూ కంటిన్యూ అవుతున్నారు.