టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంత వరకు ఎప్పుడు జరగని విధంగా ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మారిపోయాయి. ఈ సారి బరిలో ఏకంగా ఐదుగురు అభ్యర్థులు దిగనున్నారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, ప్రముఖ నటుడు, న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు పోటీ పడనున్నారు. దీనితో ఈ సారి పోటీ ఉత్కంఠభరితంగా మారింది. “మా” అభ్యర్థి సి.వి.ఎల్. నరసింహారావు..
ఈసారి కొత్తగా తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక తన నినాదం.. తెలంగాణ నినాదమని వారికి అన్యాయం జరుగకుండా ఉండాలనే పోటీలో దిగుతున్నట్లు ఇప్పటికే.. స్పష్టం చేశారు సీవీఎల్ నరసింహారావు. అయితే తాజాగా ఈ ఎన్నికపై బిజేపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ”మా” ఎన్నికలపై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైందని పేర్కొన్నారు. “నేను ‘మా’ సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్న… చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్న” అంటూ విజయ శాంతి స్పష్టం చేశారు.