సమయం వచ్చినప్పుడు డేటింగ్ రూమర్స్ పై అన్ని విషయాలను బయటపెడతానని విజయ్ దేవరకొండ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన పంచుకున్నారు. అందరితో పెంచుకోవాలనుకున్నప్పుడు దాని గురించి తప్పకుండా మాట్లాడుతానని ఆయన చెప్పారు. దీనికి ఓ ప్రత్యేక సమయం, కారణం ఉండాలని ఆయన అన్నారు. అలాంటి రోజున సంతోషంగా తన వ్యక్తిగత జీవితం గురించి అందరికి చెబుతానని ఆయన తెలిపారు.
పబ్లిక్ ఫిగర్ గా ఉన్న తన గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతారని..దీన్ని తాను ఒత్తిడిగా భావించనని చెప్పారు.ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే..బాధను కూడా మోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే..విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత కల్కి 2898 ఏడీలో అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ #VD12 కోసం వర్క్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది..!!