విజయ్ చివరి అయిదు సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే, ‘ డియర్ కామ్రేడ్’ మిశ్రమ స్పందన పొందింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ చిత్రాలు భారీ అపజయాలను చవిచూశాయి. ‘ఖుషి’ సినిమా మాత్రం కాస్త పాజిటివ్ టాక్‌తో విజయ్‌కు ఊరటనిచ్చింది. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ స్టార్’ కూడా కమర్షియల్‌గా ఫెయిలయింది. ఈ నేపథ్యంలో, విజయ్ ఫ్యాన్స్‌కు ‘కింగ్డమ్’ చిత్రం చాలా కీలకంగా మారింది.
‘జెర్సీ’ లాంటి హిట్ అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్డమ్’ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్స్లే నటిస్తుండగా, సత్యదేవ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ క్రియేషన్స్ సంస్థలు రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచంద్రన్ పని చేస్తున్నారు. మే 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది..!!