విజయ్ కెరీర్‌ను మార్చిన సినిమా పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ, చిన్న బడ్జెట్ మూవీగా వచ్చినప్పటికీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతోనే విజయ్ స్టార్ హీరోగా మారిన ప్రయాణం ప్రారంభమైంది. తాజాగా ఈ క్లాసిక్ కి సీక్వెల్ ప్లాన్ జరుగుతోందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. తరుణ్ భాస్కర్ ఇప్పటికే సీక్వెల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ ఉంది. మొదట విజయ్ తో కాకుండా, “ఈ నగరానికి ఏమైంది” సీక్వెల్ చేస్తారనే వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు పెళ్లి చూపుల సీక్వెల్ కోసమే విజయ్ తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే నెటిజన్లు, సినీ ప్రేమికులు మళ్లీ అదే స్మూత్ లవ్ స్టోరీ జోనర్ కి విజయ్ వస్తాడా? అనేది చర్చనీయాంశం. ఎందుకంటే ఆ సినిమా తర్వాత విజయ్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లిపోయాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్లు, పాన్ ఇండియా మూవీస్ తో ఆయన మాస్ హీరోగా మారిపోయారు..!!