in

vijay devarakonda opens up about his kalki arjuna role!

భారీ చిత్రంగా, బంపర్‌ హిట్‌ మూవీ టాక్‌ని అందుకున్న కల్కి 2898 ఏడీ సినిమాలో విజయ్‌ దేవరకొండ అర్జునుడిగా కనిపించి అలరించారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి, ఈ సినిమా గురించి ఆయన తన మనసులోని మాటల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు చాలా ఎమోషనల్‌గా అనిపించిందని అన్నారు. భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లినట్లు అనిపించిందని తెలిపారు.

ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నాగీ యూనివర్స్‌లో తామంతా వివిధ పాత్రలు పోషించామని చెప్పారు. ఈ సినిమాలో నటించిన వారిని విజయ్ దేవరకొండ, ప్రభాస్‌ అన్నట్లుగా చూడొద్దని అన్నారు. తనను అర్జునుడిగానే, ప్రభాస్‌ని కర్ణుడిగానే చూడమని చెప్పారు. తాను నాగ్‌ అశ్విన్‌ ప్రతి సినిమాలో చేస్తున్నని అన్నారు. అందుకు ఆయన తనని లక్కీ ఛార్మ్‌ అని చెబుతుండొచ్చుగాని సినిమాలు బాగుంటున్నాయి కాబట్టే జనాలు చూస్తున్నారని అన్నారు. అంతేకాని తాను నటించడం వల్ల ఆ సినిమాలు ఆడటం లేదని అన్నారు..!!

mega prince Varun Tej Having AI Love Story!

reason why nag ashwin dint show krishna’s face in kalki