in

Vijay Devarakonda might play the villain in pushpa 3?

తాజాగా పార్ట్ 3 టైటిల్ కూడా రివీల్ చేసారు మేకర్స్. పుష్ప 2 కి సౌండ్‌ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్న ఆస్కార్‌  విన్నర్ రసూల్‌ పూకుట్టి, తనటీమ్ తో ఉన్న ఫొటోని ఎక్స్ లో షేర్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో స్క్రీన్ మీద ”పుష్ప 3: ది ర్యాంపేజ్‌” అనే టైటిల్ ఉంది. దీనితో పార్ట్ 3 కి ‘పుష్ప ది ర్యాంపేజ్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ గతంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ రివీల్ చేసారు.

సుకుమార్ కు విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ  ‘2021 – ది రైజ్, 2022 – ది రూల్, 2023 – ది ర్యాంపేజ్‌’ అంటూ ట్వీట్ చేసాడు. ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. అందుకే సుకుమార్ విజయ్ కి ఆ టైటిల్ గూర్చి చెప్పి  ఉంటారని, విజయ్  ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హింట్ ఇచ్చాడని అంటున్నారు. నిజంగా అదే నిజమైతే అల్లు అర్జున్ కి విలన్ గా విజయ్ దేవరకొండ నటిస్తే మూవీ క్రేజ్ మరింత పెరుగుతుంది..!!

Rishab Shetty to play Chhatrapati Shivaji Maharaj!

Pushpa 2: The Rule Overall Review