రౌడీ విజయ్ దేవరకొండ తన ఇమేజ్ కి డ్యామేజ్ చేస్తూ ప్రచారం సాగించారని దేవరకొండ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియోని మీడియాకి రిలీజ్ చేశారు. వీలుంటే మంచి చేయండి .. ఫేక్ వార్తల్ని సృష్టించవద్దని కోరారు. ఇక దేవరకొండ ఫౌండేషన్ కి అత్యధిక రిక్వస్టులు రావడంతో అందరికీ సాయం అందించలేని పరిస్థితి ఉందని నిధి కోసం విరాళాలు సేకరిస్తున్నామని దేవరకొండ తెలిపారు. ఫౌండేషన్పై కొందరు ఫేక్ వార్తలు ప్రచారం చేయడంతో విరాళాల ధాతలు..
విరాళం ఇవ్వాలనుకున్న వారు నొచ్చుకుంటారని ఇలా మీడియా ముఖంగా ఆ ఫేక్ వార్తలను ఖండించారు.తప్పుడు వార్తలను ఖండిస్తూ ఓ వీడియోని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. దీనికి సూపర్ స్టార్ మహేష్ మద్దతు తెలుపుతూ.. ఇలాంటి ఫేక్ ని పుట్టించేవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మహేష్ సహా కొరటాల శివ ఇతర ఇండస్ట్రీ ప్రముఖులు దేవరకొండకు మద్ధతు పలికారు. రవితేజ- కొరటాల శివ- హరీష్ శంకర్- అనిల్ సుంకర- వంశీ పైడిపల్లి- క్రిష్ జాగర్లమూడి- మధుర శ్రీధర్- రానా దగ్గుబాటి- రాశీ ఖన్నా వంటి వారందరూ విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.