in

Vidya Balan On Being Rejected From 13 Films and Getting Replaced!

ర్టీ పిక్చర్.. కహానీ వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్. నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుంత బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్రకథానాయికలలో ఒకరిగా విద్యాబాలన్.. తన కెరీర్ అరంభంలో మాత్రం చాలా కష్టాలు పడిందట.. ఇండస్ట్రీలో కొందరు తనపట్ల దారుణంగా ప్రవర్తించారని.. దాంతో తనకు ఇండస్ట్రీ అంటేనే అసహ్యం వచ్చేలా చేశారంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఆమె నటించిన లేటేస్ట్ చిత్రం జల్సా. అమెజాన్ ప్రైమ్‏లో కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా.. విద్యాబాలన్ తన కెరీర్‏లో పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది..

విద్యాబాలన్ మొదటి సినిమా తుమ్హారీ సులు మూవీ తర్వాత దాదాపు పదముడూ సినిమాల్లో నుంచి ఆమెను తీసివేశారని తెలిపింది. అప్పట్లో తనను సినిమాల నుంచి తీసివేసిన నిర్మాతలే ఇప్పుడు కాల్ చేసి సినిమాలు చేయమని అడుగుతున్నారని.. కానీ.. అలాంటి వారి ఆఫర్స్ తాను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది..అంతేకాకుండా..అప్పట్లో ఓ నిర్మాత తనపట్ల దారుణంగా ప్రవర్తించాడని వివరించింది. అంతేకాకుండా.. ఓ నిర్మాత నా పట్ల దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవాడు.. అతని ప్రవర్తన వలన నన్ను నేను ఆరు నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు ధైర్యం చేయలేకపోయాను. 2003లో జరిగింది ఈ సంఘటన.. ఆ సమయంలో ఏ సినిమా చేయాలనుకున్న కుదరలేదని చెప్పింది.

young director sudheer varma gets a mega combination chance!

Malavika Mohan hints about getting on board for Prabhas’s next!