
జయసుధ 67 ఏళ్ల వయసులో కూడా సినిమాల్లో ఎన్నో ఆఫర్లు సంపాదించుకుంటూ దూసుకుపోతోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన జయసుధ ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తోంది. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా హీరో,హీరోయిన్ల మధ్య సినిమాల్లో చేసేటప్పుడు ప్రేమ కలుగుతుందా అనే విషయం గురించి చెబుతూ.., “నిజమైన ప్రేమ అంటే మాటల్లో ‘లవ్ యూ’ అని చెప్పడం కాదు. ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తే, అది అతని ప్రవర్తనలో.. గౌరవంలో కనిపిస్తుంది..
అఫైర్ అనేది కేవలం శారీరక ఆకర్షణతో మొదలవుతుంది..అది ఎక్కువగా కలిసి పనిచేసే వాతావరణంలో ఏర్పడే కెమిస్ట్రీ వల్ల జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది కామన్” అని చెప్పారు. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..“నాకు వ్యక్తిత్వం చాలా ముఖ్యం. దాని కోసం నేను నా విలువలను ఎప్పటికీ త్యాగం చేయను. చాలామంది మనల్ని ప్రయత్నిస్తారు కానీ మనం తెలివిగా ఉండాలి” అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, కొందరు పురుషులు మహిళలను తక్కువగా అంచనా వేస్తారని, కానీ మహిళలు కూడా చాలా తెలివైనవారని అన్నారు..!!
