సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరంలో క్రియాటినైన్ లెవెల్స్ పెరగడంతో శరీరం అంతట ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ ల పనితీరు దెబ్బతిందని వైద్యులు వెల్లడించారు. మరి కొన్ని గంటలు గడిస్తే గాని ఆయన ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత రాదని తెలిపారు.
గత కొంతకాలంగా స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న శరత్ బాబు తొలుత బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆసుపత్రిలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శరత్ బాబు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కథానాయకుడిగా, విలన్ గా, తండ్రిగా, సహాయ నటుడిగా కనిపించి మెప్పించారు. తెలుగులో చివరిసారిగా ‘వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ప్రోత్సహించే సీనియర్ లాయర్ గా కనిపించారు..!!