జూన్ 6న ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే త్రివిక్రమ్ స్టయిల్‌లో సిద్ధమైపోయిందట. కామెడీ ఎమోషన్స్ తో మిక్స్ చేసిన ఈ కథలో వెంకటేశ్ పాత్ర ఓ ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీ మెన్‌గా ఉంటుందట. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, “సప్త సాగరాలు” సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి వసంతను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. వెంకటేశ్ సరసన ఆమెకు జోడీగా అవకాశం రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది..
అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉండటంతో మధ్యలో ఉన్న టైమ్‌ను వెంకటేశ్ చిత్రానికి వినియోగించాలని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ జూన్‌లో లాంఛనంగా ప్రారంభమైతే, ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అభిమానులు మాత్రం వెంకీ – త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ‘మినిమం గ్యారంటీ’ అనుకుంటూ భారీగా అంచనాలు పెట్టుకున్నారు..!!