in

Venkatesh and Kalyan Ram to star in Anil Ravipudi’s next!

రుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతోందని వెల్లడించారు. 2027 సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం సోషల్ మీడియా ద్వారా తెలిపారు..

చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ తర్వాత  కొంతకాలంగా అనిల్ రావిపూడి తదుపరి చిత్రంలో వెంకటేష్‌తో పాటు మరో హీరో ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటికీ తెరదించుతూ కల్యాణ్ రామ్ పేరును ఖరారు చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “నాకు మొదటిసారి ‘బొమ్మ’ తీసే అవకాశం ఇచ్చిన హీరో కల్యాణ్ రామ్‌తో, నా మొదటి ‘వందకోట్ల బొమ్మ’ కొట్టిన హీరో వెంకటేష్ గారితో కలిసి 2027 మొదటి పండక్కి మీ ముందుకు వస్తున్నాం” అని పేర్కొన్నారు..!!

Taapsee Pannu recalls embarrassing demands to wear padded bras!

Hey Balwanth!