జీవితం ఎవరికీ రెడ్ కార్పెట్ పరచి వెల్ కం చెప్పదు, అలాగే గాన గంధర్వుడు బాలు గారి మొదటి అవకాశం కూడా ఆయనకు పరీక్ష పెట్టింది, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రం లో ఆయన పాడిన మొదటి పాట రికార్డింగ్ మధ్యాహ్నం 2 గంటలకు విజయ గార్డెన్స్ లోని రికార్డింగ్ థియేటర్ లో, కారు కోసం ఎదురుచూస్తున్న బాలు గారు, మధ్యాహ్నం 2 .30 అయినా కారు రాలేదు, కంగారు గ ఎదురు చూస్తున్న బాలు గారికి స్నేహితుడు మురళి ఇచ్చిన సలహా మేరకు ఇద్దరు సైకిళ్ళ మీద విజయ గార్డెన్స్ కు చేరుకున్నారు, రికార్డింగ్ థియేటర్ లో పాడటానికి వచ్చిన యువకుడు సైకిల్ మీద రావటం చూసి అక్కడ ఉన్న వాచ్ మాన్ కి నమ్మకం కలగక, లోపలి కి వెళ్లనివ్వలేదు, కనీసం ఒక్కరినయినా లోపలి వెళ్లనివ్వమని భంగపడితే, ఒక్కరిని లోపలికి వెళ్లనిచ్చాడు వాచ్ మాన్, లోపలికి వెళ్లిన మురళి ప్రొడక్షన్ వాళ్లకు విషయం చెప్పగానే,
ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి బాలు గారిని లోపలికి తీసుకొని వెళ్లారు, లోపల ఉన్న కోదండపాణి గారి చివాట్లు, అసలు విషయం ఏమిటంటే వీరి కోసం పంపిన కారు చిన్న ప్రమాదానికి గురి అయి వీరి దగ్గరకు వేళ్ళ లేదు. పాట రిహార్సల్ అయ్యాక రికార్డింగ్ కి ముందు, నిర్మాత పద్మనాభం గారు చూడు బాబు నువ్వు రిహార్సల్ లో బాగానే పాడుతున్నావు, రికార్డింగ్ లో సరిగా పాడాలి లేక పోతే నీ బదులు వేరే వారి తో పాడించ వలసి ఉంటుంది అని చెప్పారట.చివరకు బాలు గారు దేవుడి మీద భారం వేసి రికార్డింగ్ పూర్తి చేసారు, సింగల్ టేక్ లో ఒకే, చాల బాగా పాడవు అని అందరు చప్పట్లు, పద్మనాభం గారు భుజం తట్టి, నీకు మంచి భవిష్యత్ ఉంది, అని అన్నారట. అంత ఉత్కంఠ భరితం గ ప్రారంభం అయింది గాన గంధర్వుడి సినీ ప్రయాణం.