టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి, వ్యాపార వేత్త ఉపసాన కొనిదెల ఎప్పుడూ సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల పలువురు హీరోయిన్ లతో కుకింగ్ వీడియోలు చేసి ఆరోగ్య వంతమైన వంటకాలను షేర్ చేశారు. అప్పుడప్పుడూ ఫిట్నెస్ టిప్ లను సైతం ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా ఉపాసన తన క్లోజ్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్ అని చెప్పారు. అంతే కాకుండా ఆమె తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఫోటోలు దిగారు.
ఆ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా లో షేర్ చేశారు. తన తమ్ముడి పెళ్లి నేపథ్యంలో ట్రాన్స్ జెండర్ లను ఇంటికి ఆహ్వానించి వారితో సెలబ్రేషన్స్ చేసుకుని…. వారి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు..ఇక ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ మేడం….మీరు చాలా మంచి వారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఉపాసన తన ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారని తెలుస్తోంది.