in

unlucky Srinidhi Shetty’s sita role went to sai pallavi

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజయస్ చిత్రాల్లో నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్న ‘రామాయణం’ కూడా ఒకటి. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, అందాల భామ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రావణాసురుడిగా యశ్ నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే, ఈ మెగా ప్రాజెక్ట్‌లో తొలుత సీత పాత్ర కోసం సాయి పల్లవి కంటే ముందు వేరొక హీరోయిన్ ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది..

ఆమె ఎవరో కాదు..‘హిట్-3’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీనిధి శెట్టి. ‘కేజీయఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రామాయణం’ సినిమాలో సీత పాత్ర కోసం ఆమె ఆడిషన్ ఇచ్చినట్లు తాజాగా పేర్కొంది. కానీ కేజీఎఫ్ సినిమాలో యశ్ పక్కన హీరోయిన్‌గా చేసిన తర్వాత, ఆయన రావణుడిగా, తాను సీతగా నటిస్తే ప్రేక్షకులకు నచ్చదేమో అనే ఫీలింగ్ కలిగిందని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది..!!

Sarangapani Jathakam!