in

unlike others no offers for kajal aggarwal now!

సౌత్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత పూర్తి గా ఖాళీ అయిపోయింది. పెళ్లై పిల్లలు పుట్టాక ఎలాంటి వారికైనా లుక్కులో తేడా వస్తుంది. బాలీవుడ్ భామలు ఆ తేడాలు రాకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకే వాళ్లు పెళ్లై పిల్లలు పుట్టినా కూడా ఎక్కడ తగ్గకుండా ఛాన్స్ లు అందుకుంటారు. కానీ సౌత్ హీరోయిన్స్ విషయంలో మాత్రం అది వేరేలా ఉంటుంది. పెళ్లైన హీరోయిన్ అంటే చాలు పక్కన పెట్టేస్తారు. ఐతే కాజల్ కూడా పెళ్లి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకోగా మళ్లీ తిరిగి సినిమాలు చేయాలని చూస్తుంటే ఆమెకు అవకాశాలు రావట్లేదు.

లాస్ట్ ఇయర్ సత్యభామ అంటూ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా అటెంప్ట్ చేసింది కానీ అది అంతగా కలిసి రాలేదు..ప్రస్తుతం అమ్మడు మంచు విష్ణు కన్నప్పలో పార్వతి దేవి పాత్రలో నటిస్తుంది. హీరోయిన్ గా టాప్ స్టార్స్ అందరితో జత కట్టిన కాజల్ ఇలా సైడ్ రోల్స్ చేయడం కష్టంగానే ఉంటుంది. ఐతే ఇప్పటికి తను హీరోయిన్ గా చేస్తానని కాజల్ అంటున్నా ఆ ఛాన్స్ ఇచ్చేందుకు మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. బాలకృష్ణ భగవంత్ కేసరిలో నటించిన కాజల్ మళ్లీ మరో స్టార్ ఛాన్స్ అందుకోలేదు..!!

Samantha, Naga Chaitanya re-unite for promoting ‘Ye Maaya chesave’ re-release?

Mumbai Police Reacts To Malavika Mohanan’s Incident In Local Train