సీనియర్ నటి శారద, నటిగా తెలుగునాట సుపరిచితురాలు మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న అరుదయిన మేటి నటి శారద గారు. చాలా మంది గత తరం నటి,నటుల లాగా శారద గారు సినిమాలు తీయకుండా వ్యాపార రంగం లో ప్రవేశించి ఆర్ధికంగా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. నటిగా ఆమె కెరీర్ ఉజ్వలంగా వెలిగిపోతున్న రోజులలో ఆమె రెండవ భర్త అయిన విజయ రాఘవన్ నంబియార్ ప్రోత్సాహం తో వ్యాపార రంగం లో ప్రవేశించారు. తనకు ఏమాత్రం పరిచయం లేని అనుభవం లేని, చాక్లెట్ పరిశ్రమ స్థాపించారు. లోటస్ కాంఫిషనరీ పేరుతో చాక్లెట్ తయారీ కంపెనీ ప్రారంభించారు, జీవితంలో చేసిన అతి పెద్ద రెండవ తప్పు ఇది. మొదటి తప్పు, చలం ని వివాహం చేసుకొని వ్యక్తిగత జీవితం లో ఎన్నో బాధలు అనుభవించిన ఆమె, ఈ వ్యాపారం తో ఆర్ధికమయిన ఇబ్బందుల పాలయ్యారు.
ఈ వ్యాపార ప్రారంభం యెన్.టి.ఆర్ చేతుల మీద జరిగింది, మొదటి చాక్లెట్ ను మెగా స్టార్ చిరంజీవి అందుకున్నారు, ప్రారంభం జరిగినంత గొప్పగా వ్యాపారం సాగలేదు. అప్పటికే కాంఫిషనరీ రంగం లో దిగ్గజ కంపెనీలు అయిన పారిస్, న్యూట్రిన్, క్యాడ్బఆరిస్, తో పోటీకి నిలవలేక చతికిల పడింది. శారద గారి రెండవ భర్త అయిన విజయ రాఘవన్ కి ఉన్న అనుభవం ఆధారంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన శారద గారు అయోమయం లో పడిపోయారు. ఆ సమయంలోనే విజయ రాఘవన్ నంబియార్ వ్యాపారాన్ని, శారద గారిని నట్టేట ముంచి వెళ్లిపోయారు. అప్పటి వరకు నటిగా ఆమె సంపాదించిన సంపాదన అంత హారతి కర్పూరం అయింది, ఇబ్బందుల్లో తోడుగా నిలవాల్సిన భర్త, తన దారి తాను చూసుకున్నాడు. ఆర్ధికంగా దెబ్బ తినటమే కాకుండా మానసికంగా కూడా కుంగి పోయారు శారద.
మళ్ళీ తన కెరీర్ మీద దృష్టి పెట్టిన శారద గారు ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడ్డారు. మళ్ళీ జీవితం లో మూడో సారి తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డారు. విజ్ఞత కలిగిన మనిషిగా ఆమె మళ్ళీ తప్పు చేయకుండా నిలదొక్కుగో కలిగారు, అదే విజ్ఞత కోల్పోయిన కొంతమంది జీవితాలు ఛిద్రం చేసుకున్న ఉదాహరణలు ఎన్నో. అదేమీ చిత్రమో కానీ మన సినీ నటి, నటుల జీవితాలలో పరాయి వారికంటే అయిన వారే, నమ్మిన వారే, మోసం చేసి వీరి పతనానినికి కారణం అవుతుంటారు. బహుశా కళాకారులు సున్నిత మనస్కులు కావటం వలన, వీరు గుడ్డిగా, అయిన వారి మీద ప్రేమతో, వారిని నమ్మటం వలన కావచ్చు. ఇలా మోసపోయిన వారిలో శారద గారు మొదటి వారు కాదు, చివరి వారు అంతకంటే కాదు, ఈ ప్రహసనం ఇలా కావునసాగుతూనే ఉంటుందేమో? మన చుట్టూ ఉన్న జనం, మన అంత,మంచి వారు కాదు అనే విషయం గమనించుకోవటం చాల ఉత్తమం..!!