డార్లింగ్ ప్రభాస్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మంచి స్వింగ్ మీదున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనికి ముందు నుంచి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దాన్ని పూర్తిగా ఖండించడం కానీ కొత్తది ప్రకటించడం కానీ చేయకపోవడంతో ప్రస్తుతానికి ఫ్యాన్స్ ఇదే ఫిక్స్ అయ్యారు. ఒక పాత థియేటర్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో హారర్ కామెడీ జానర్ లో రూపొందిస్తున్నట్టు ఆల్రెడీ లీక్ ఉంది. చాలా తక్కువ కాల్ షీట్లతో వీలైనంత వేగంగా రెండు మూడు నెలల్లోనే టాకీ పార్ట్ పూర్తయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు వినికిడి.
హీరోయిన్లు ఇద్దరు ఉంటారని ప్రస్తుతానికి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అడిగితే వీళ్ళు నో చెప్పేంత బిజీగా లేరు, ప్రభాస్ సరసన నటించేందుకు కాదనేంత అమాయకురాళ్లు అసలే కాదు. సో నిజంగా ప్రపోజల్ వెళ్లుంటే మాత్రం కన్ఫర్మ్ అయినట్టే. విలన్ గా సంజయ్ దత్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాకపోతే ఆయన డేట్లు మరీ టైట్ గా ఉండటంతో ఫైనల్ అయ్యేది లేనిది తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోగా మిగిలిన వ్యవహారాలు చక్కదిద్దే పనిలో మారుతీ టీమ్ చాలా బిజీగా ఉన్నట్టు తెలిసింది..!!